పురుషులు పుణ్యపురుషులు


నీళ్ళుత్రాగేవారు

కొందరు

రక్తముక్రోలువారు

కొందరు


మధువుపుచ్చుకునేవారు

కొందరు

మద్యపానముచేయువారు

కొందరు


చూపులతోసుఖపెట్టువారు

కొందరు

మాటలతోముంచేవారు

కొందరు


చేతులుపట్టుకునేవారు

కొందరు

కాళ్ళుపట్టిపడదోచేవారు

కొందరు


కరుణాత్ములు

కొందరు

కాఠిన్యపరులు

కొందరు


ప్రేమాత్ములు

కొందరు

ద్వేషపరులు

కొందరు


మంచివాళ్ళు

కొందరు

మోసగాళ్ళు

కొందరు


న్యాయపరులు

కొందరు

అవినీతిపరులు

కొందరు


సహజపరులు

కొందరు

నటించేవారు

కొందరు


ధైర్వవంతులు

కొందరు

పిరికిపందలు

కొందరు


బాగుకోరేవారు

కొందరు

చెడుకోరేవారు

కొందరు


ఆశీస్సులిచ్చేవారు

కొందరు

అసూయపడేవారు

కొందరు


శ్రమించేవారు

కొందరు

సోమరపోతులు

కొందరు


దాచుకునేవారు

కొందరు

దోచుకునేవారు

కొందరు


సహాయపరులు

కొందరు

పట్టించుకోనివారు

కొందరు


ప్రేమపావురాలు

కొందరు

విషసర్పాలు

కొందరు


కామధేనువులు 

కొందరు

అడ్డగాడిదలు

కొందరు


పరుగులెత్తేవారు

కొందరు

పాకుకుంటుపోయేవారు

కొందరు


పొగిడేవారు

కొందరు

తెగిడేవారు

కొందరు


మానవులు

కొందరు

దానవులు

కొందరు


పుణ్యాత్ముల

ప్రేమిస్తా

పాపాత్ముల

పనిపడతా


సమాజానికి

సేవజేస్తా

సాటివారిని

సంతసపరుస్తా


పెద్దలకు

ప్రణమిల్లుతా

పిల్లలకు

దీవెనలిస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog