సుద్దులు
సుద్దులు
చెబుతా
బుద్ధులు
మార్చుతా
పెద్దలమాటలు
వినుమురా
చిల్లరపనులు
చేయకురా
తెల్లనివన్ని
పాలుకాదురా
నల్లనివన్ని
నీళ్ళుకాదురా
పరుగెత్తి
పాలుత్రాగుటకన్నా
నిలబడి
నీళ్ళుత్రాగుటమేలురా
మాధవసేవ
కన్నా
మానవసేవ
మిన్నరా
వట్టిమాటలు
చెప్పకురా
గట్టిచేతలు
చూపరా
దానధర్మములు
చెయ్యరా
పుణ్యఫలములు
పొందరా
పోరాడి
గెలవరా
ప్రఖ్యాతి
పొందరా
నిదానము
ప్రధానమయినా
ఆలశ్యము
అనర్ధదాయకమురా
చెప్పింది
చెయ్యరా
మాటయిచ్చి
మరువకురా
ప్రేమను
చూపరా
ద్వేషము
వీడురా
అపకారికైనను
చెయ్యరా
ఉపకారమును
భావించకన్యధా
చూచి
నడవరా
క్రింద
పడకురా
ఆలోచించి
అడుగులెయ్యరా
అరచేతులుకాలినతర్వాత
ఆకులుపట్టుకొన్నలాభమేమిరా
మేలుచేసినవారిని
మరువకురా
కీడుచేసినవారిని
క్షమించురా
ఆరోగ్యము
మహాభాగ్యమురా
విత్తముకొరకు
వెంపరలాడకురా
ఉన్నదానితో
తృప్తిపొందరా
లేనిదానికై
పాకులాడకురా
జరిగినదంతా
మంచికనుకోరా
జరగబోయేవాటిపై
దృష్టిపెట్టరా
అనుకున్నామని
అన్నీజరగవురా
అనుకోలేదని
ఆగవురా
తల్లిదండ్రులను
ప్రేమించరా
గురువులను
గౌరవించరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment