పదునుపెట్టిన ప్రేయసి


లేమ లెమ్మంది

లెస్స పలికింది

లేటు వలదంది

లేకి కావద్దంది


భామ బాగుంది

భుజము తట్టింది

బుగ్గ గిల్లింది 

భ్రమ కలిగించింది


ప్రేమనొలికింది

ప్రేరేపించింది

ప్రోత్సహించింది

ప్రేయసిగామారింది


వలపువల విసిరింది

వయ్యారాలు చూపింది

వగలాటలాడింది

వణికిసలాడింది


తల నిమిరింది

తలపులు లేపింది

తనువును తాకింది

తనివి తీర్చింది


దొరనని పిలిచింది

దగ్గరకు వచ్చింది

దమ్ము చూపమంది

దడదడలాడించమంది


దొరసానిని చెయ్యమంది

దోరవయసు దోచుకోమంది

దోబూచులాట వద్దంది

దొరతనము చూపమంది


ముందుకు వెళ్ళాలనియున్నది

మనుమాడాలని యున్నది

మెడనువంచాలని యున్నది

మంగళసూత్రం కట్టాలనియున్నది


కలమును పట్టమంది

కవితను వ్రాయమంది

కమ్మదనము చూపమంది

కలకాలము నిలువమంది


కథలు వ్రాయమంది

కాంతులు చిమ్మమంది

కళకళ మెరువమంది

ఖ్యాతిని పొందమంది


సంసారం

సాగిస్తా

సాహిత్యం

సానపడతా


దీవిస్తే

ధన్యుడనవుతా

పొగిడితే

పొంగిపొర్లుతా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog