పూలకవి పుష్పాలాపనలు


పూలవనమును

పెంచరా

పువ్వులమధ్యన

తిరుగరా


అందాలపూలను

చూడరా

ఆనందమును

పొందరా


పూలపరిమళాలు

పీల్చరా

పూలప్రాభవమును

చాటరా


పూలవన్నెలు

పరికించరా

పలువిధముల

ప్రస్తుతించరా


పూలస్నేహమును

చేయరా

పూలమనసులను

తెలుసుకోరా


పువ్వులు

కోమలమురా

తాకిన

నలిగిపోవురా


పూలపానుపును

ఎక్కరా

పొద్దుపొడిచేవరకు

పవళించరా


పుష్పాంజలులు

ఘటించరా

ప్రేమాభిమానాలు

తెలుపరా


పుష్పగుచ్ఛమును

ఇవ్వరా

మదిలోనిప్రేమను

తెల్పరా


పూలప్రేమను

ఎరుగరా

పూలప్రియునిగా

ఎదుగరా


పుష్పమాలలు

అల్లరా

తెలుగుతల్లిమెడన

వెయ్యరా


పూలబాషను

నేర్వరా

పుష్పబాలలతో

మాట్లాడరా


పూలబ్రతుకులు

కాంచరా

పూలకవితలను

వ్రాయరా


పువ్వులను

తలచుకోరా

పలుకైతలను

రచించరా


పూలలోకమును

పరికింపజేయరా

పాఠకులను

ప్రమోదపరచరా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog