తొలకరిజల్లులు


వేడిగాలితో

వేగుచుంటిమి

మండుటెండలో

మాడుచుంటిమి


ఉక్కపోతతో

ఉడుకుచుంటిమి

చెమటతడిలో

తడుచుచుంటిమి


వరుణదేవుని

వేడుచుంటిమి

వానలిమ్మని

కోరుచుంటిమి


వాయుదేవుని

అదుగుచుంటిమి

చల్లగాలిని

వీచమనుచుంటిమి


పరమాత్ముని

పూజించుచుంటిమి

వానలిమ్మని

వేడుకొనుచుంటిమి


నల్లమబ్బులా

పిలుచుచుంటిమి

కరువుతీరా

కురిపించమంటిమి


కుండపోతగా

వర్షించమంటిమి

కప్పలపెళ్ళిల్లనూ

చేయుచుంటిమి


కణికరమును

చూపమంటిమి

కష్టములను

తొలగించమంటిమి


పశుపక్షులను

కావమంటిమి

జంతుజాలమును

కాపాడమంటిమి


చెరువులను

నింపమంటిమి

వాగువంకలను

పారించమంటిమి


పూజలు

ఫలించాయి

వానలు

వరించాయి


చినుకులు

చిటపటమంటున్నాయి

చిందులు

తొక్కమంటున్నాయి


ఉరుములు

గర్జిస్తున్నాయి

మెరుపులు

మెరుస్తున్నాయి


చినుకులు

చిందుచున్నాయి

చల్లగాలులు

వీచుచున్నాయి


చేపపిల్లలు

ఈదుచున్నాయి

కప్పపిల్లలు

ఎగురుతున్నాయి


చిన్నపిల్లలు

ఆడుతున్నారు

పెద్దవాళ్ళు

పరికిస్తున్నారు


తొలకరిజల్లులు

ఆగమనం

ఉక్కపోతనుండి

ఉపశమనం


వానకు

స్వాగతం

కవితకు

విరామం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog