పేరులో ఏముంది?
పేరులో ఏముందిరా
పువ్వును ఏపేరునపిలిచినా
పొంకము పోదురా
పరిమళము తగ్గదురా
పేరుకున్న
అర్ధము
నేతిబీరకాయలోనున్న
నెయ్యితోసమానము
పేరుపెట్టిన
పెద్దల ఉద్దేశము
పిల్లలు తీర్చుట
ఉచితము భావ్యము
పేర్లకు
తోకలు తగిలించుకుంటారు
కులమును
సగర్వంగా చాటుకుంటారు
పేరును
ప్రేమగాపిలుస్తారు
మదులను
ముచ్చటపరుస్తారు
పేరును
విరుస్తారు
కసిని
తీర్చుకుంటారు
పేరుకోసము
పాకులాడుతారు
పొందినపుడు
పరవశించిపోతారు
పేరునుబట్టి
జాతకాలువ్రాస్తారు
భవిష్యత్తును
ఊహించుకుంటారు
పేర్లనుపట్టి
పెళ్ళిల్లుచేస్తారు
నిజమనినమ్మి
నూరేళ్ళపంటనుపండిస్తారు
పేర్లను
బడిలోపిలుస్తారు
హాజరు
నమోదుచేస్తారు
పేర్లను
చెప్పిస్తారు
కొత్తపెళ్ళిజంటలను
కలుపుతారు
పేర్లకున్న
ప్రాముఖ్యము
కడలియంత
అపారము
పేర్లచరిత్రను
పరిశీలించరా
ప్రాధాన్యతను
పరిగణించరా
పేరును
నిలుపుకోరా
సార్ధకనాముడిగా
పేరొందరా
పొడుగుపేరు
వద్దురా
పొట్టిపేరు
ముద్దురా
పేరు
పొందరా
నోర్లలో
నానరా
పేరుకొరకు
వ్రాయలేదురా
పొగడ్తలకు
పొంగిపోనురా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment