పూలమీద ప్రేమ


పూలమీద

మనసుపడె

ముచ్చటించి

మురిపిస్తా


పూలమీద

గాలిమల్లె

పలువురకు

సోకిస్తా


పూలమీద

ప్రేమపుట్టె

పొరుగువారికి

తగిలిస్తా


పూలమీద

పిచ్చిపట్టె

పెక్కుమందికి

ఎక్కిస్తా


పూలమీద

రక్తికలిగె

పదిమందికి

ముట్టిస్తా


పూలమీద

పాటపాడుతా

పక్కవారికి

వినిపించుతా


పూలమీద

జాలిచూపుతా

అందరిని

అనుసరించమంటా


పూలమీద

చూపుసారిస్తా

అందాలను

ఆస్వాదించుతా


పూలమీద

నీళ్ళుచల్లతా

వాడకుండా

ఉండమంటా


పూలమీద

ప్రశంసలుకురిపిస్తా

అందరినీ

చదవమంటా


పూలమీద

కన్నేస్తా

ఆనందాన్ని

జుర్రుకుంటా


పూలమీద

చెయ్యేస్తా

పరవశించి

పొంగిపోతా


పూలమీద

ముద్రవేస్తా

పూలకవిని

తలపిస్తా


పూలమీద

హక్కునాదని

ప్రజాకోర్టుకు

విన్నవిస్తా


పూలమీద

కవితరాస్తా

పాఠకులను

పఠింపజేస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog