నేను నా కవిత
(కవితతో నా ముచ్చట్లు)
కవిత
రాత్రివచ్చింది
నిదురలేపింది
కవ్వించింది
కవనంచెయ్యమంది
నేను
కదలలా
మెదలలా
ఉలుకలా
పలుకలా
ఆమె
గీపెట్టింది
గోలచేసింది
బుంగమూతిపెట్టింది
బ్రతిమలాడింది
కవి లేలెమ్మంది
కలం పట్టమంది
కాగితాలపై కక్కమంది
కవితను సృష్టించమంది
అందాలు చూడమంది
ఆనందం పొందమంది
ఆంతరంగాలను తట్టమంది
అద్బుతకవితను వ్రాయమంది
కవిత్వం
మరువద్దంది
మానవద్దంది
మంచిగావ్రాయమంది
పాఠకులను
పఠింపజేయమంది
పరవశపరచమంది
ప్రోత్సాహపరచమంది
విషయాలలో
వైవిధ్యం చూపమంది
విన్నూతనంగా వ్రాయమంది
విశేషప్రతిభ కనపరచమంది
కవిత్వంలో
శిల్పముండాలంది
శైలిబాగుండాలంది
స్ఫూర్తిదాయకంగాయుండాలంది
కవనంలో
ప్రాసలుండాలంది
పోలికలుండాలంది
పసందుకలిగించాలంది
శీర్షిక
ఆకర్షించాలంది
ముగింపు
మదినిముట్టాలంది
కవితకు
ధన్యవాదాలు
వాణీదేవికి
వందనాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మూడు రోజులనుండి పనుల వత్తిడి వలన సమయం చిక్కక కలం పట్టలా, కవితలు రాయలా. పత్రికలకు, పాఠకులకు పంపలా. ఫోనుచేసి పలుకరించిన కవిమిత్రులకు ధన్యవాదాలు.
Comments
Post a Comment