పువ్వంటే?


పువ్వంటే

అందము

చూచినంత

ఆనందము


పువ్వంటే

పరిమళము

పీల్చినంత

ప్రమోదము


పువ్వంటే

ప్రణయము

మన్మధుని

మోహనాస్త్రము


పువ్వంటే

వికాసవంతము

కళ్ళనుచేయు

దేదీప్యమానము


పువ్వంటే

సౌభాగ్యము

పడతులకు

పుణ్యసూచకము


పువ్వంటే

ప్రకాశము

మోములకు

ముదావహము


పువ్వంటే

సుకుమారము

తాకినయిచ్చు

సంతోషము


పువ్వంటే

వర్ణశోభితము

పరికించనిచ్చు

పారవశ్యము


పువ్వంటే

అలంకారము

తరుణులకిచ్చు

సౌందర్యము


పువ్వంటే

కవితావిషయము

కవులచేవ్రాయించు

కమ్మనికవిత్వము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog