ఎవడే నీవాడు?
బంగారపు
ఛాయవాడు
చిరునవ్వులు
చిందువాడు
పువ్వులా
అందమైనవాడు
పరిమళాలు
వెదజల్లేవాడు
పక్షిలా
ఎగిరేవాడు
మబ్బులా
తేలేవాడు
సూర్యుడులా
వెలిగేవాడు
చంద్రుడిలా
వెన్నెలకాసేవాడు
తారకలా
తళతళలాడేవాడు
మెరుపులా
మెరిసిపోయేవాడు
రాముడిలా
రమణీయడు
కృష్ణుడిలా
మోహనరూపుడు
మన్మధుడిలా
సొగసైనవాడు
మనసులను
దోచుకునేవాడు
కోర్కేలు
లేపేవాడు
కొమ్ము
కాసేవాడు
మత్తు
చల్లేవాడు
చిత్తు
చేసేవాడు
చెంతకు
పిలిచేవాడు
చెలిమి
చేసేవాడు
వాడే
నావాడు
వాడే
నామగడు
భారం
భరించేవాడు
కుటుంబం
నడిపేవాడు
తోడుగా
ఉండేవాడు
జోడుగా
నిలిచేవాడు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment