కవితామృతము
కలమును
కదిలించాలనియున్నది
కవితామృతమును
కార్పించాలనియున్నది
అమృతమును
అందించాలనియున్నది
అందరిని
అమరులచేయాలనియున్నది
అమృతవర్షము
ఆకసమునుండికురిపించాలనియున్నది
అందరిని
అందులోతడిపిముద్దచేయాలనియున్నది
అమృతజల్లులు
చిలుకరించాలనియున్నది
అందరిని
శుద్ధిచేయాలనియున్నది
కవనామృతమును
చేర్చాలనియున్నది
కవితాప్రియులను
కుతూహలపరచాలనియున్నది
అమృతకలశము
నింపాలనియున్నది
అడిగినవారలకు
అందజేయాలనియున్నది
అక్షరాలను
చిలకాలనియున్నది
అమృతమును
తీయాలనియున్నది
పదములను
పొంగించాలనియున్నది
పదామృతమును
పంచిపెట్టాలనియున్నది
అంతరంగమును
మదించాలనియున్నది
ఆలోచనామృతమును
వెలికితీయాలనియున్నది
సుధను
సృష్టించాలనియున్నది
వ్యధలను
వెడలకొట్టాలనియున్నది
పీయూషమును
పొత్తాలందునింపాలనియున్నది
పాఠకులను
పరవశింపజేయాలనియున్నది
వాణీవీణానాదమును
వినిపించాలనియున్నది
సాహిత్యసుధారసమును
సర్వులకుచేర్చాలనియున్నది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment