కవిమార్తాండుడు


అడుగో అల్లడుగో

అద్భుతకవనమార్తాండుడు


సూర్యోదయసమయంలో

తెల్లవారివెలుగులాతెలుగునుదిద్దువాడు


అల్పాక్షరాలతో

అనల్పార్ధస్ఫురణచేయువాడు


భావాంబరవీధిలో

బహుకాలమువిహరించువాడు


కవితకవ్వింపులతో

కలమునుచేతపట్టినవాడు


సాహితీసౌజన్యముతో

సుధాభరితకైతలనల్లువాడు


అద్వితీయవర్ణనలతో

అందాలకయితలనందించువాడు


పూలకవితలతో

పాఠకులనుపులకరించువాడు


చల్లనివెన్నెలలో

చదువరులనుసంచరింపజేయువాడు


పద్యపఠనంతో

ప్రేక్షకులనుపరవశపరచువాడు


పదప్రయోగముతో

పెక్కురికితేటతెలుగునుపరిచయముచేస్తున్నవాడు


సాహిత్యములో

సర్వదామునిగితేలుతున్నవాడు


కవితాముర్తికి వందనాలు

కవితాసృష్టికి నీరాజనాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog