కవితలెందుకు పుట్టాయో?


అక్షరాలు

ఆకర్షించాయో

పదాలు

పరవశపరచాయో


అందాలు

ఆకట్టుకున్నాయో

ఆనందాలు

అందుకోమన్నాయో


తనువు

తహతహలాడిందో

మనసు

మురిసిపోయిందో


ఊహలు 

ఉత్సాహపరచాయో

భావాలు

బయటకొచ్చాయో


కలము

చేతికొచ్చిందో

కాగితం

చెక్కమనియడిగిందో


పాఠకులు

ప్రాధేయపడ్డారో

విమర్శకులు

విన్నవించుకున్నారో


గాయకులు

వ్రాయమన్నారో

ప్రేక్షకులు

పాటలనడిగారో


మది

మధించమన్నదో

మేధ

మెరుగులుదిద్దిందో


హయగ్రీవుదు

ఆశీర్వదించాడో

సరస్వతీదేవి

కరుణించిందో


కవిత్వము

పుట్టకొచ్చింది 

సాహిత్యము

సంపన్నమయ్యింది


కవితంటే

తలకాయ తపాలయితే

తలపులు నీరయితే

పాత్ర నిండిపోతే

పొంగిపొర్లిపోయేదే


కవితంటే

అన్నంవండి

కూరలుచేసి

అరిటాకువేసి

వడ్డించేవిందుభోజనమే


కవితంటే

వికసించి

సొగలుచూపి

పరిమళంచల్లి

పరవశపరిచేపువ్వే


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog