ఎందుకనో.....
(కాలం మారింది)
మునగకాయల్లో
రుచిపచి
లోపించింది
కరివేపాకులో
సువాసన
అంతరించింది
బీరకాయల్లో
నెయ్యి
అదృశ్యమయ్యింది
పలుకుల్లో
ప్రేమలు
పటాపంచలయ్యాయి
పెదవుల్లో
తేనెచుక్కలు
చిందటంలేదు
పిల్లల్లో
గౌరవం
నశించింది
మహిళల్లో
వాలుజడలు
వేసేవారులేరు
కొప్పుల్లో
పూలు
కనిపించటంలేదు
మోముల్లో
చిరునవ్వులు
కనబడటంలేదు
మనసుల్లో
మమకారం
మాడిపోయింది
మనుజుల్లో
మానవత్వం
మృగ్యమయ్యింది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment