మంచిముచ్చట్లు


మంచితనము

చాటాలని

కాచుకొనియున్నా


మంచిపనులు

చేయాలని

వేచియున్నా


మంచిస్నేహాలు

కావాలని

కాంక్షిస్తున్నా


మంచిసలహాలు

ఇవ్వాలని

వీక్షిస్తున్నా


మంచిమనసు

చూపాలని

తలపోస్తున్నా


మంచిమార్గము

ఎంచుకొమ్మని

మనవిచెస్తున్నా


మంచితోడు

తెచ్చుకోమని

తెలియజేస్తున్నా


మంచిమాటలు

ఆలకించమని

విన్నవిస్తున్నా


మంచిలోకము

సృష్టించమని

సలహానిస్తున్నా


మంచియాలోచనలు

పుట్టాలని

ప్రార్ధిసున్నా


మంచివిషయాలు

తట్టాలని

మొక్కుతున్నా


మంచికవితలు

వ్రాయాలని

ముచ్చటపడుతున్నా


మంచిపాఠకులు

మెచ్చుకుంటారని

మనసుకునచ్చచెబుతున్నా


మంచివిఙ్ఞత

చూపమని

వినతిచేస్తున్నా


మంచిరాతలు

ముందుంచుతానని

మాటయిస్తున్నా


వేమనబద్దనలను

గుర్తుకుతేవాలని

ప్రయత్నిస్తున్నా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog