నేను నాప్రాణము
పరమాత్ముడిచ్చిన
ప్రాణం
పరంధామునిసేవకే
అంకితం
జననీజనకులిచ్చిన
ప్రాణం
జన్మనిచ్చినవారికే
సమర్పణం
నాకు తీపికాదు
ప్రాణం
నేను విడవటానికి
సిద్ధం
నాకు అమూల్యంకాదు
ప్రాణం
నాకది గడ్డిపూసతో
సమానం
ఓరోజు వచ్చాడు
దైవం
కోరినప్పుడే తీసుకెళ్తాననిచేశాడు
ప్రమాణం
పడదన్నాడెపుడు యముని
పాశం
యమదూతలపై పెట్టాడు
నిషేదం
కోరినపుడు తెస్తానన్నాడు
రథం
ఎక్కించుకొని చేరుస్తానన్నాడు
స్వర్గం
అందుకే
రోగభయమూలేదు
మృత్యుభీతీలేదు
ప్రాణప్రీతీలేదు
ప్రాణంతో ఆడను
చెలగాటం
జీవితంతో ఆడను
నాటకం
త్రాగను
అమృతం
కోరను
అమరత్వం
కానీ నాకవితలు
పుటలకెక్కాలి
శాశ్వతంగా
నిలిచిపోవాలి
కాగితాలు
వెలగాలి
కవితలు
వర్ధిల్లాలి
పాఠకులంటే
ప్రాణం
విమర్శకులంటే
విశ్వాసం
నాభావం
నాకిష్టం
నాకవిత్వం
నాకుప్రాణం
సాహిత్యానికి
స్వాగతం
వాణీదేవికి
వందనం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment