తెలుగోడా లేవరా!
తెలుగును
వెలిగిస్తా
తెరువును
చూపిస్తా
తెలుగుబాట
నడిపిస్తా
తెలుగుతోట
చేరుస్తా
తెలుగుదనము
చాటుతా
కమ్మదనము
కలిగిస్తా
తెలుగన్నలను
గౌరవిస్తా
తెలుగుతమ్ముళ్ళ
దీవిస్తా
తెలుగుమాటలు
పలుకుతా
తేనెచుక్కలు
చల్లుతా
తెలుగును
చిలుకుతా
అమృతమును
అందిస్తా
తెలుగక్షరాలు
అల్లుతా
తియ్యనికవితలు
చదివిస్తా
తెలుగుపదాలు
పారిస్తా
తలలోతలపులు
పొర్లిస్తా
తెలుగునుడులు
వాడుతా
తేటతెలుగును
చూపుతా
తెలుగుపాటలు
పాడుతా
గళమాధుర్యాలు
కుమ్మరిస్తా
తెలుగుసమ్మేళనాలు
నిర్వహిస్తా
కవులకుసత్కారాలు
జరిపిస్తా
తెలుగుతల్లిని
తరచుతలపిస్తా
తెలుగువారిని
తృప్తిపరుస్తా
తెలుగుపౌరుషాలు
నెమరేస్తా
తెలుగుప్రఖ్యాతులు
గుర్తుచేస్తా
కన్నతల్లికి
సేవలుచేస్తా
తెలుగుతల్లికి
పూజలుచేస్తా
తెలుగుకు
జైజైయంటా
తెనుగుకు
జయహోయంటా
తెలుగోడా
లేవరా
తగినపాత్రనూ
పోషించరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment