జీవితం 


జీవితం అందమైనదోయ్

అనుమానం అక్కరలేదోయ్


కాలం అనంతమోయ్

జీవితం అతిస్వల్పమోయ్


పోయినకాలం రాదోయ్

చక్కగసమయం వాడవోయ్


భూమికి బరువుకాకోయ్

ప్రకృతిని పరిరక్షించుకోవోయ్


తోటిప్రాణులను బాధపెట్టకోయ్

సహజీవులను సంరక్షించవోయ్


ప్రపంచము ఒకనాటకరంగమోయ్

నీపాత్రను నువ్వుపోషించవోయ్


జీవితమంటే ప్రాణంకాదోయ్

ఆత్మీయుల ప్రేమానుబంధమోయ్


జీవితమంటే కాలక్షేపంకాదోయ్

అందాలను  ఆస్వాదించటమోయ్


జీవితమంటే జననమరణాలుకాదోయ్

వందేళ్ళు జరుపుకోవలసినపండుగోయ్


జీవితమంటే సుదూరపయనంకాదోయ్

సుఖాలను అనుభవించటమేనోయ్


జీవితమంటే సంపాదనకాదోయ్

లక్ష్యాలను సాధించటమోయ్


జీవితమంటే కలలుకనటంకాదోయ్

కోరికలను నెరవేర్చుకొనటమోయ్


జీవితం బహుచక్కనిదోయ్

తెలుసుకొని ధన్యంచేసుకోవోయ్


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog