తెలుగుసాహితీవనం


సుందరసుమాల

సాహితీవనం

సందర్శిస్తా


తనివితీరేవరకు

తెలుగుతోటలో

తిరుగుతా


అందమైన

అక్షరకుసుమాలతో

ఆడుకుంటా


అద్భుతమైన

అలరులపదమాలలు

అల్లేస్తా


పంక్తులుగా

పలుపుష్పాలను

పేరుస్తా


ప్రాసలతో

పూలపాదాలను

పెల్లెత్తిస్తా


వైవిధ్యంగా

విరులవిషయాలు

వివరిస్తా


కమ్మనైన

కవితాకుసుమాలతో

కనువిందుచేస్తా


చుట్టుపక్కల

సుమసౌరభాలను

చల్లేస్తా


పాఠకులను

పువ్వులపొంకాలను

పరికింపజేస్తా


విమర్శకులకు

వివిధకవనవంటకాలను

వడ్డిస్తా


తెలుగుతల్లిని

తేనెపలుకులతో

తృప్తిపరుస్తా


అమ్మభారతిని

ఆర్తవాలతో

అలంకరిస్తా


అక్షరాల

అధిష్టానదేవతను

అలరిస్తా


వేడుకొని

వాగ్దేవి

వరంపొందుతా


నాలుకపైకి

నలువలరాణిని

నిలువమంటా 


వీణాపాణి

వెలుగులు

వెదజల్లుతా


విద్యాదేవి

విఙ్ఙానము

వ్యాపిస్తా


విడమఱచి

వాస్తవాలను

వివరిస్తా


చదువరులను

సాహిత్యలోకంలో

సంచరింపజేస్తా


సరస్వతీదేవిని

సదాస్వాగతిస్తా

సుకవితలనువ్రాయించమంటా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog