నచ్చిన నాచెలి


నచ్చింది నచ్చింది

నాచెలి

తట్టింది తట్టింది 

నామది


నవ్వింది నవ్వింది

ననుచూచి

రమ్మంది రమ్మంది

ననుదరికి


ఒలికింది ఒలికింది

వయ్యారము

చూపింది చూపింది

సింగారము


రమ్మంది రమ్మంది

తోటలోకి

సయ్యంది సయ్యంది

సరసాలకి


ఆలశ్యం

నేచేయను

అవకాశం

నేవదలను


కవితను

కూర్చుతా

నవ్యతను

చూపిస్తా


పాటను

వ్రాస్తా

రాగము

తీస్తా


"చెప్పనా

తియ్యగా చెప్పనా

చూచిన అందాలను

పొందిన ఆనందాలను

చెప్పనా

తియ్యగా చెప్పనా


చూడనా

చెలిని చూడనా

చారడేసి కళ్ళను

చక్కదనాల రూపును

చూడనా

చెలిని చూడనా


వెళ్ళనా

ముందుకు వెళ్ళనా

అడుగులు ఆగకుండావేస్తు

ఆమె ఆహ్వానిస్తున్నచోటుకు

వెళ్ళనా

ముందుకు వెళ్ళనా


తెలుపనా

ప్రేమను తెలుపనా

చెలిని చెంతకుపిలచి 

చెవిలోన గుసగుసలాడి 

తెలుపనా

ప్రేమను తెలుపనా


వ్రాయనా

పాటను వ్రాయనా

విభిన్న విషయాలుతెలుపుతు

విన్నూతన విధానమునందు

వ్రాయనా

పాటను వ్రాయనా"


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog