సర్వేజనా సుఖినోభవంతు 


మేడిపండువంటి

సమాజాన్ని

పరికించుదాం

పరిరక్షించుదాం


అన్నములేక

అలమటిస్తున్న

అనాధలను

ఆదుకుందాం


పనులులేక

పరితపిస్తున్న

నిరుద్యోగులకు

అండనిద్దాం


చదువుకోలేక

ఇబ్బందులుపడుతున్న

యువతీయువకులను

చేరదీద్దాం


జబ్బులపాలపడి

డబ్బులులేక

బాధలుపడుతున్నవారికి

భరోసానిద్దాం


పట్టించుకోక

వదలివేసినట్టి

అభాగ్యులకు

చేయూతనిద్దాం


ఆలనాపాలనాలేక

బాధలుపడుతున్న

పసిపాపలను

పెంచిపోషిద్దాం


ఆరుగాలంశ్రమించినా

ఫలితందక్కని

రైతుకుటుంబాలకు

ఊరటనిద్దాం


అవస్థలుపడుతున్న

అణగారినవర్గాలను

చేరదీసి

అభివృద్ధిపరుద్దాం


పిల్లలువదిలేసిన

అనాధాశ్రమాలలో

తలదాచుకుంటున్న

వృద్ధులకుసాయంచేద్దాం


దిక్కూమొక్కూలేక

శరీరాలనమ్ముకొని

కాలంగడుపుతున్న

పడతులకాశ్రమమిద్దాం


గత్యంతరంలేక

వీధులలోతిరిగి

యాచిస్తున్న

అమాయకులనుద్ధరిద్దాం


ఓట్లుకొని

అధికారంచేతబట్టి

పరిపాలిస్తున్న

నేతలపనిపడదాం


సమాజాన్ని

అభివృద్ధిచేద్దాం

నవసమాజాన్ని

నిర్మాణంచేద్దాం


జనహితాన్ని

కోరుదాం

కలసిముందుకు

కదులుదాం


సోదరసోదరీమణులారా

స్వార్ధమునువీడండి

సమాజమునుచూడండి

సర్వేజనశ్రేయస్సుకుసహకరించండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog