నామనసు


నామనసు

పిచ్చిది

ఆలోచనలతో

సతమతమవుతుంది


నామనసు

మట్టి

అక్షరసేద్యం

చెయ్యమంటుంది


నామనసు

అద్దము

చూచినవన్నీ

ప్రతిబింబింబిస్తుంది


నామనసు

పక్షి

గాలిలో

ఎగురుతుంది


నామనసు

వాహనం

భూమిమీద

పరుగులుతీస్తుంది 


నామనసు

నీరు

నదిలా

ప్రవహిస్తుంది


నామనసు

నిప్పు

కోపమొస్తే

దహించేస్తుంది


నామనసు

మమతాస్థానం

ప్రేమిస్తే

ప్రాణమిస్తానంటుంది


నామనసు

గాలి

అన్నిదిక్కులా

వ్యాపిస్తుంది


నామనసు

ఙ్ఞానస్థానం

ఆలోచనలలో

ముంచేస్తుంది


నామనసు

వెలుగు

దివ్వెలా

కాంతులుచిమ్ముతుంది


నామనసు

పిరికిపంద

తలలో దాక్కుంటుంది

బయటకు రానంటుంది


నామనసు

ఒకకోతి

కిచకిచమంటుంది

గంతులేస్తుంది


నామనసు

మార్గదర్శి

నన్ను ముందుకు

నడిపిస్తుంది


నామనసు

సీతాకోకచిలుక

పువ్వులపై

వ్రాలుతుంది


నామనసు

మల్లెపువ్వు

పరిమళాలను

వెదజల్లుతుంది


నామనసు

ఒకకవి

కవితలను

వ్రాయిస్తుంది


నామనసు

మొండిది

తీరు

మార్చుకోనంటుంది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog