పూలపాఠాలు
పువ్వులాగా
వికసించవోయ్
పరిమళాలను
వెదజల్లవోయ్
పువ్వులాగా
వెలుగవోయ్
ప్రకాశమును
వ్యాపించవోయ్
పువ్వులాగా
కనిపించవోయ్
పరికించువార్లను
కుతూహలపరచవోయ్
పువ్వులాగా
ప్రఖ్యాతిపొందవోయ్
ప్రజలమదులలందు
నిలిచిపోవోయ్
పువ్వులాగా
ప్రేమించవోయ్
ప్రణయలోకమును
పాలించవోయ్
పువ్వులాగా
ఆకర్షించవోయ్
ఆయస్కాంతమును
తలపించవోయ్
పువ్వులాగా
పులకించవోయ్
పొరుగువార్లను
ప్రేరేపించవోయ్
పువ్వులాగా
అందాలుచూపవోయ్
పరమానందమును
అందరికందించవోయ్
పువ్వులాగా
రంగులుచూపవోయ్
పలువన్నెలందు
పారవశ్యమివ్వవోయ్
పువ్వులాగా
ప్రోత్సహించవోయ్
పసందైనకైతలను
పుటలకెక్కించవోయ్
పూలనుండి
పాఠాలునేర్వవోయ్
పిల్లాపెద్దలకు
ప్రబోధించవోయ్
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment