అందాలకళ్ళు
(కళ్ళకబుర్లు)
కళ్ళు
పలుకుతున్నాయి
కథలు
వినిపిస్తున్నాయి
కళ్ళు
కాటుకపెట్టుకున్నాయి
వయ్యారాలు
ఒలకబోస్తున్నాయి
కళ్ళు
నవ్వుతున్నాయి
ముఖాన్ని
వెలిగిస్తున్నాయి
కళ్ళు
చూస్తున్నాయి
కబుర్లు
చెబుతున్నాయి
కళ్ళు
వెలుగుతున్నాయి
సంతసాన్ని
వెలువరిస్తున్నాయి
కళ్ళు
అందాలనుచూపుతున్నాయి
ఆనందాన్ని
అంతరంగానికందిస్తున్నాయి
కళ్ళు
తెరవమంటున్నాయి
చక్కదనాన్ని
చూడమంటున్నాయి
కళ్ళు
నడుపుతున్నాయి
దారులు
చూపిస్తున్నాయి
కళ్ళు
కనిపెట్టుండమంటున్నాయి
దుమ్ము
పడనీయవద్దంటున్నాయి
కళ్ళు
కాచుకోమంటున్నాయి
కానలేకపోతే
జీవితమంధకారమంటున్నాయి
కళ్ళు
చెమ్మగిల్లనియొద్దంటున్నాయి
హృదయం
ద్రవించినీయవద్దంటున్నాయి
కళ్ళు
పిలుస్తున్నాయి
కవితను
కూర్చమంటున్నాయి
కళ్ళు
వెంటబడుతున్నాయి
కవనం
చెయ్యమంటున్నాయి
కళ్ళు
మెరిసిపోతున్నాయి
కవితావిషయాన్ని
కనబరుస్తున్నాయి
కళ్ళు
కవ్విస్తున్నాయి
కలమును
పట్టమంటున్నాయి
కళ్ళు
తెలుసుకోమంటున్నాయి
కాయానికి
నయనాలేముఖ్యమంటున్నాయి
కళ్ళు
ఇంద్రియప్రధానాన్నంటున్నాయి
ప్రపంచదర్శనానికి
ద్వారాన్నంటున్నాయి
కళ్ళు
పొడుచుకోకు
కష్టాలు
తెచ్చుకోకు
కళ్ళు
కావరమెక్కనీకు
జీవితానికి
ఎసరుతెచ్చుకోకు
కళ్ళను
కాపాడుకో
జీవితాన్ని
చక్కబరచుకో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment