ఓరి బుజ్జోడా!
చెంతకూ రారా
చంకనూ ఎక్కరా
పకపకా నవ్వరా
మోమునూ వెలిగించరా
ముద్దులూ ఇవ్వరా
మురిపమూ చెయ్యరా
ముద్దుగా మాట్లాడరా
మదినీ ముట్టేయరా
గుసగుసా లాడరా
గుబులునూ లేపరా
అందంగా తయారవరా
అందరినీ ఆకట్టుకోరా
నోరునూ తెరవరా
అమృతాన్ని చిందరా
నెమలిపింఛము పెట్టుకోరా
చిన్నికృష్ణుని తలపించరా
మురళినీ వాయించరా
మిత్రులా గుమికూడ్చరా
చిందులు వెయ్యరా
ఉత్సాహ పరచరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment