ఓ పిల్లా!


ప్రేమలో

పడ్డావటే పిల్లా

పెళ్ళికీ

తయారటే పిల్లా   ||ప్రేమలో||


చూపులు

కలిపావటే పిల్లా

గాలము

విసిరావటే పిల్లా


పువ్వులు

పెట్టావటే పిల్లా

నవ్వులు

చిందావటే పిల్లా   ||ప్రేమలో||


మనసు

పడ్డావటే పిల్లా

సొగసు

చూపావటే పిల్లా


ప్రియుడు

పిలిచాడటే పిల్లా

చెంతకు

చేరావటే పిల్లా   ||ప్రేమలో||


అందాలు

ఆరబోశావటే పిల్లా

ఆనందము

అందించావటే పిల్లా


మాటలు

కలిపావటే పిల్లా

మరులు

కొలిపావటే పిల్లా  ||ప్రేమలో||


సరసాలు

ఆడావటే పిల్లా

సరదాలు

చేశావటే పిల్లా 


పరువాలు

చూపావటే పిల్లా

పగ్గాలు

వేశావటే పిల్లా   ||ప్రేమలో|| 


ముచ్చట్లు

చెప్పావటే పిల్లా

ముద్దులు

ఇచ్చావటే పిల్లా


కోర్కెను

చెప్పావటే పిల్లా

సిగ్గులు

ఒలికావటే పిల్లా  ||ప్రేమలో||


మల్లెలు

తెచ్చాడటే పిల్లా

కొప్పులో

తురిమాడటే పిల్లా


తేనెను

చిందావటే పిల్లా

అమృతాన్ని

అందించవటే పిల్లా  ||ప్రేమలో||


తోడు

కోరుకున్నావటే పిల్లా

జోడు

తెచ్చుకున్నావటే పిల్లా


ఆకాశములో

ఎగిరావటే పిల్లా

ఆనందములో

తేలిపోయావటే పిల్లా  ||ప్రేమలో||


వివాహానికి

పిలుస్తావటే పిల్లా

విందుభోజనము

పెడతావటే పిల్లా


అక్షింతలు

వేయమంటావటే పిల్లా

ఆశిస్సులు

అందించామంటావటే పిల్లా  ||ప్రేమలో||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog