చందమామ చిక్కినరోజు


అమ్మా అమ్మా

విన్నావటమ్మా

నిన్న చంద్రునిపై

విక్రందిగిందటమ్మా


చందమామ రావేయని

పిలువకమ్మా

మనమే జాబిలిచెంతకు

వెళ్దామమ్మా


చందమామపై

ఆడుకుంటానమ్మా

జాబిల్లిపైన

విహరిస్తానమ్మా


చంద్రుని సొగసులు

చూస్తానమ్మా

చంద్రుని కవితలు

వ్రాస్తానమ్మా


చంద్రునిపై

ఇల్లుకట్టుకుందామమ్మా

చంద్రునిపై

నివాసముందామమ్మా


చంద్రునిపై

సేద్యంచేద్దామమ్మా

చంద్రునిపై

పంటలుపండిద్దామమ్మా


చంద్రయాన్ నిన్న

చంద్రుని దరిచేరిందమ్మా

విక్రం నిన్న

చంద్రునిపై దిగిందమ్మా


ఫొటోలు చాలా

తీసిందమ్మా

భూమికి వాటిని

పంపిందమ్మా


త్రివర్ణపతాకము

జాబిలిపై ఎగిరిందమ్మా

భారతీయుల మనసులు

పొంగి పొర్లాయమ్మా


జాబిల్లి

చిక్కిందమ్మా

మోములు

వెలిగాయమ్మా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog