రవి-కవి


రవి

కిరణాలు చల్లుతున్నాడు

కవి

అక్షరాలు విసురుతున్నాడు


రవి

జనుల నిద్రలేపుతున్నాడు

కవి

మదుల మేల్కొలుపుతున్నాడు


రవి

అంధకారాన్ని పారదోలుతున్నాడు

కవి

అఙ్ఞానాన్ని అంతముచేస్తున్నాడు


రవి

ప్రతిదినం ఉదయించుతున్నాడు

కవి

నిత్యము ఉత్సాహపరుస్తున్నాడు


రవి

కాలాన్ని నడుపుతున్నాడు

కవి

కలమును కదిలిస్తున్నాడు


రవి

దినమును మొదలుపెడుతున్నాడు

కవి

పఠనమును ప్రారంబించుతున్నాడు


రవి

నిప్పులు చెలరేగుతున్నాడు

కవి

కవితలు కూర్చేస్తున్నాడు


రవి

పయనిస్తున్నాడు

కవి

గమనిస్తున్నాడు


రవి

ఋతువులిస్తున్నాడు

కవి

కయితలిస్తున్నాడు


రవి

ఆకాశంలో తిరుగుతున్నాడు

కవి

అంతరంగాల్లో వసిస్తున్నాడు


రవి

కనిపించుతున్నాడు

కవి 

వినిపించుతున్నాడు


రవి

అందాలనుచూపుతున్నాడు

కవి 

ఆనందముకూరుస్తున్నాడు


రవి

చూడనిచోట్లను

కవి

కాంచుతున్నాడు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog