భావప్రకంపనలు


తలల్లో

పుడతా

పుటల్లో

ఎక్కుతా


అక్షరాలలో

అవతరిస్తా

పదాలలో

ప్రత్యక్షమవుతా


కమ్మదనాలు

కురిపిస్తా

తియ్యదనాలు

తినిపిస్తా


తనివి

తీరుస్తా

మదిని

ముట్టేస్తా


అందాలు

చూపిస్తా

ఆనందము

కలిగిస్తా


ఆలోచనలను

లేపుతా

అంతరంగాలను

తడతా


పూదోటల్లో

తిప్పుతా

వెన్నెలలో

విహరింపజేస్తా


సుమాలు

చూపుతా

సౌరభాలు

చల్లుతా


నవ్వులు

చిందిస్తా

మోములు

వెలిగిస్తా


నీరులా

ప్రవహిస్తా

గాలిలా

వ్యాపిస్తా


నింగికి

రంగేస్తా

నీలిమబ్బులు

తేలించుతా


ఆకాశంలోకి

తీసుకెళ్తా

హరివిల్లుని

చూపించుతా


అభిమానులను

ఆకర్షిస్తా

ఆయస్కాంతంలా

అంటుకుంటా


కవనంతో

కట్టిపడేస్తా

కవితలతో

కుషీచేస్తా


భావాలతో

భ్రమగొల్పుతా

భావకవిత్వంలో

ముంచేస్తా


భావప్రకంపనలు

సృష్టిస్తా

భావకవితలను

పారిస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog