ఎందుకు?


పరిమళములేని

పువ్వులెందుకు?

మాధుర్యంలేని

కవితలెందుకు?


తోడులేని

జీవితాలెందుకు?

పిల్లలులేని

గృహాలెందుకు?


నవ్వులేని

మోములెందుకు?

జాబిలిలేని

ఆకాశమెందుకు?


తీపిలేని

పలుకులెందుకు?

నీరులేని

నదులెందుకు?


అర్ధములేని

వాగుడెందుకు?

వ్యర్ధమైన

పనులెందుకు?


అవసరములేని

ఆలోచనలెందుకు?

బహిరంగపరచని

భావాలెందుకు?


పొట్టనింపని

చదువులెందుకు?

ఆకలితీర్చని

ఉద్యోగాలెందుకు?


వానలుకురవని

మేఘాలెందుకు?

పంటలుపండని

పొలాలెందుకు?


సంతసములేని

కాపురాలెందుకు?

గమ్యములేని

ప్రయాణాలెందుకు?


ఆకర్షణలేని

అక్షరాలెందుకు?

ప్రకాశములేని

పదాలెందుకు?


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog