ఉషోదయం కవితోదయం
ఉషోదయం
అయ్యింది
కవితోదయం
అయ్యింది
కిరణాలు
ప్రసరించాయి
అక్షరాలు
వెలువడ్డాయి
తూర్పు
తెల్లవారింది
కవిత
తయారయ్యింది
జగత్తు
చైతన్యమయ్యింది
భావము
బహిర్గతమయ్యింది
మనుషులు
మేలుకొన్నారు
మనసులను
మురిపించారు
కవిత్వం
పండింది
ప్రపంచం
పరవశించింది
కలాన్ని
హలమన్నారు
కవనాన్ని
సేద్యమన్నారు
కవిని
రవియన్నారు
కవిత్వాన్ని
అమృతమన్నారు
కవులను
తలచుకోండి
రచనలను
చదవండి
అందాలు
ఆస్వాదించండి
ఆనందము
అందుకోండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment