సాహితీవనం


సాహిత్యం

స్వాగతిస్తుంది

హరితవనం

ఆహ్వానిస్తుంది


కవిత్వం

కవ్విస్తుంది

కాననం

కట్టేస్తుంది


మస్తకం

నేలయ్యింది

సాహిత్యం

వనమయ్యింది


మనసు

పూదోటయ్యింది

సొగసుకు

స్థావరమయ్యింది


మొక్కలు

మొలిచాయి

సస్యము

చుట్టుముట్టింది


కొమ్మలు

పెరుగుతున్నాయి

ఆకులు

పుడుతున్నాయి


పువ్వులు

పూస్తున్నాయి

కాయలు

కాస్తున్నాయి


అందాలు

ఆకర్షిస్తున్నాయి

ఆనందము

కలిగిస్తున్నాయి


పువ్వులు

అక్షరాలయ్యాయి

మాలలు

కవితలయ్యాయి


పరిమళాలు

వ్యాపిస్తున్నాయి

కవనాలు

కొనసాగుతున్నాయి


సెలయేరు

ప్రవహిస్తుంది

కవితాఝరి

స్రవిస్తుంది


హరితవనం

ఆహ్వానిస్తుంది

సాహిత్యలోకం

పిలుస్తుంది


కవిత్వసారాన్ని

ఆస్వాదించండి

సాహిత్యరసాన్ని

పానముచేయండి


గుండ్లపల్లి రాజంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog