మన చంద్రయానం

 

విక్రం

చంద్రుడిపైదిగింది

చంద్రయానం

విజయవంతమయ్యింది


జాబిలిపై

త్రివర్ణపతాకం రెపరెపలాడింది

జనులమోములపై

సంతోషం వెల్లివిరిసింది


శాస్త్రవేత్తలకు

అభివందనలు 

భారతీయులకు

శుభాకాంక్షలు 


ఇస్రో విజయం

దేశానికి గర్వకారణం

మన శాస్త్రఙ్ఞానం

ప్రపంచానికే ఒకపాఠం


శ్రీహరికోట

పేరు మ్రోగింది

తెలుగుప్రదేశము

జగానికి తెలిసింది


ఎన్నెన్నో

విజయాలు సాధించాలి

త్వరలో

చంద్రునిపై కాలుమోపాలి


అంగారకుని

చేరాలి

శుక్రుడిమర్మాలను

ఛేదించాలి


సూర్యునిసమాచారం

సేకరించాలి

విశ్వరహస్యాలు

కనుగొనాలి 


తెలివైనవారమని

చాటాలి

భారతీయులమని

గర్వించాలి


జయహో

భారతదేశం

జయజయహో

భారతదేశం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog