నా కవితలు
గుండె చప్పుళ్ళు
మది ముచ్చట్లు
నా కవితలు
అందాల దృశ్యాలు
ఆనంద క్షణాలు
నా కవితలు
అంగులు చూపి
అలరించె అలరులు
నా కవితలు
పరిమళాలు చల్లే
పసందైన పుష్పాలు
నా కవితలు
చక్కెర కలిపిన
చిక్కని పాలు
నా కవితలు
తేనెలు చిందే
తియ్యని పలుకులు
నా కవితలు
వెలుగులు చిమ్మే
చంద్ర వదనాలు
నా కవితలు
నీరు పారే
జీవ నదులు
నా కవితలు
పచ్చని కాపురాలు
సుఖమైన బ్రతుకులు
నా కవితలు
కుతూహల పరచే
కమ్మని రాతలు
నా కవితలు
అర్ధాలు స్ఫురించే
అద్బుత అక్షరాలు
నా కవితలు
ప్రాసలు కూడిన
లయాత్మక పదాలు
నా కవితలు
తెలుగుదనం నిండిన
తేట నుడికారాలు
నా కవితలు
భావ గర్భితమైన
విన్నూతన విషయాలు
నా కవితలు
విన్న వారికి
వీనుల విందులు
నా కవితలు
చదివిన వారిని
వదలని విషయాలు
నా కవితలు
ఆస్వాదిస్తే ఆనందిస్తా
సలహాలిస్తే స్వీకరిస్తా
తలచుకుంటే తృప్తిపడతా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment