భావావేశం
ఆకాశంలో
అందమైన
జాబిలిపువ్వు
పూయటంచూశా
చల్లనివెన్నెల
పుప్పొడిని
కురిపించటం
కనులారాకాంచా
మేఘాలు
చిటపటమని
చినుకులురాల్చటం
పొడగన్నా
పచ్చనిమొక్కలు
హాయిగా
ఊపిరిపీల్చటం
దర్శించా
మొగ్గలు
ముడుచుకొని
మొహమాటపడటం
తిలకించా
రవినిచూచి
ధైర్యంతెచ్చుకొని
విరులువికసించటం
వీక్షించా
కొమ్మలు
ఊగటం
ఆకులు
కదలటంకన్నా
కళ్ళను
మూసేశా
మనసును
తెరచిచూచా
పెదవులకు
తాళంవేశా
మునివేళ్ళకు
మాట్లాడటంనేర్పా
కాళ్ళను
కట్టేశా
గాలిలో
తిరిగా
పూలను
అక్షరాలకుతొడిగా
పదాలను
మాలలుగాగుచ్చా
ఊహలను
తలలో ఊరించా
భావాలను
పుటలలో పారించా
కవితలను
కమ్మగాసృష్టించా
కల్పనలల్లి
పాఠకులనుమురిపించా
హాయిగా
చదవండి
ఆనందమును
పొందండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment