శ్రావణమాసం


శ్రావణమాసం

శుభమాసం

సౌభాగ్యవతులకు

వరలక్ష్మీవ్రతమాసం


విష్ణుదేవుని

జన్మనక్షత్రం శ్రావణం

లక్ష్మీదేవికి

అత్యంత ప్రీతిపాత్రమాసం


శ్రావణశుక్రవారం

సుదినం

సుహాసనీలకు

శుభప్రదం


శ్రావణారాధనం

విశిష్టం

ముత్తైదువులకు

మంగళప్రదం


శ్రావణమాసం

అతిపవిత్రం

ప్రతిగృహం

తలపించుదేవాలయం


శ్రావణమాసం

మొత్తం

మారుమ్రోగును

దైవనామస్మరణం


శ్రావణపూజలు

స్త్రీలకుప్రియం

భక్తులందరికి

విశ్వాసనీయం


శ్రావణమాసంలో

నదీస్నానం

ఆరోగ్యప్రదం

ఆనందదాయకం


శ్రావణమాసంలో

సుముహూర్తాలనేకం

శుభకార్యాలను

చేసేద్దాం


లక్ష్మీదేవిని

కొలుద్దాం

సిరిసంపదలను

పొందుదాం


శ్రీలక్ష్మిని

అరాధిద్దాం

అమ్మవారికరుణకటాక్షాలకు

పాత్రులగుదాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog