అక్షరకేళి
అక్షరాలకు
అత్తరురాస్తా
పదాలకు
పన్నీరుపూస్తా
పరిమళాలు
పారిస్తా
పంక్తులు
పేరుస్తా
ముచ్చట్లు
చెప్పేస్తా
ముఖాలు
వెలిగిస్తా
అందాలు
చూపిస్తా
ఆనందము
అందిస్తా
వన్నెలు
చిందిస్తా
వయ్యారాలు
ఒలికిస్తా
పుటలకు
ఎక్కిస్తా
మదులకు
పనిబెడతా
విరులు
విసిరేస్తా
మరులు
కొలిపిస్తా
సుమశరాలు
సంధిస్తా
పుష్పబాణాలు
సారిస్తా
తనువులు
తట్టుతా
మనసులు
ముట్టుతా
తలలలో
దూరుతా
మెదళ్ళలో
మకాంపెడతా
కవితలు
విసురుతా
కనపడక
వినిపిస్తా
భావాలను
బయటపెడతా
విషయాలను
విశదీకరిస్తా
అక్షరాలతో
ఆటలాడతా
పదములతో
ప్రయోగంచేస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment