పూలకవితలు


పువ్వుమీద

తేటివ్రాలినట్లు

పూదొటమధ్య

కవివ్రాలాడు

 

పువ్వులు

తేనెనిచ్చినట్లు

కవిగారు

తీపినిపంచుతున్నారు


అవకాశం

వాడుకోండి

మకరందం

జుర్రుకోండి


మొగ్గలు

తొడిగాయి

కలాలు

కదిలాయి


పువ్వులు

పూచాయి

కైతలు

తట్టాయి


పూలు

పెరిగాయి

కవితలు

కూరాయి


విరులు

విరిసాయి

కయితలు

వెలువడ్డాయి


అందాలు

చూపాయి

ఆనందము

ఇచ్చాయి


రంగులు

చూపాయి

హంగులు

అద్దుకున్నాయి


కళ్ళను

కట్టేశాయి

మనసులను

ముట్టేశాయి


పరిమళాలు

చల్లాయి

పరవశాలు

పంచాయి


పూవులు

మాలలయ్యాయి

అక్షరాలు

పంక్తులయ్యాయి


పొంకాలు

చూపాయి

భావాలు

తెలిపాయి


సుమాలు

సుందరంగాయున్నాయి

కవనాలు

కమ్మగాతయారయ్యాయి


పూలు

తెంచుకోమంటున్నాయి

కవితలు

చదువుకోమంటున్నాయి


పుష్పాలు

తీసుకొనివెళ్ళమంటున్నాయి

కవితలు

మదిలోనిలుపుకోమంటున్నాయి


పూదోటలోని

పుష్పాలు

సాహిత్యంలోని

కవనాలు


చూచి

సంబరపడండి

చదివి

సంతసించండి


పూలను

పరికించండి

కవితలను

పఠించండి


పూలను

మెచ్చుకోండి

కవులను

కీర్తించండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog