చెలికాడా!


విరినై

వికసించనా

పూవునై

పరిమళించనా


పువ్వునై

మదినిదోచుకోనా

నవ్వునై

మోమువెలిగించనా


అప్సరసనై

అందాలుచూపనా

ఊర్వశినై

ఉత్సాహపరచనా


చెలియనై

చెంతకురానా

ప్రేయసినై

ప్రేమించనా


వధువునై

తోడుగానిలువనా

మధువునై

తీపినందించనా


తోడై

నూరేళ్ళునిలవనా

నీడై

వదలకవెంటుండనా


పత్నినై

పతిసేవలుచెయ్యనా

భార్యనై

భాద్యతలుపంచుకోనా


సిరినై

చేకూరనా

సంపదనై

సమకూరనా


శాంతినై

స్థిమితపరచనా

సుఖమునై

సంతసపరచనా


రవినై

కాంతులుచిందనా

శశినై

వెన్నెలకురిపించనా


అక్షరాలనై

అలరించనా

పదములనై

పరవశపరచనా


గేయమునై

వినిపించనా

కవితనై

చదివించనా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog