సహధర్మిణితో సరాగాలు


చూడటం

నా వంతయ్యింది

నవ్వటం

నీ వంతయ్యింది


పిలవటం

నా వంతయ్యింది

పలకటం

నీ వంతయ్యింది


మాట్లాడటం

నా వంతయ్యింది

వినటం

నీ వంతయ్యింది


కోరటం

నా వంతయ్యింది

ఒప్పుకోటం

నీ వంతయ్యింది


అందం

నీ వంతయ్యింది

ఆనందం

నా వంతయ్యింది


సంపాదన

నా వంతయ్యింది

వ్యయం

నీ వంతయ్యింది


ఉద్యోగం

నా వంతయ్యింది

గృహం

నీ వంతయ్యింది


తినటం

నా వంతయ్యింది

వండటం

నీ వంతయ్యింది


శ్రమించటం

నా వంతయ్యింది

సుఖశయనం

నీ వంతయ్యింది


బయటపెత్తనం

నా వంతయ్యింది

ఇంటిపెత్తనం

నీ వంతయ్యింది


కవితలు

వ్రాయటం

నా వంతయ్యింది

చదవటం

నీ వంతయ్యింది


సహధర్మిణీ!

వంతులు

మార్చుకుందామా 

పాత్రలు

తారుమారుచేసుకుందామా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యన్నగరం


Comments

Popular posts from this blog