తెలుగుతోట
తెలుగుతోట
పిలుస్తుంది
వెలుగుబాట
చూపుతుంది
తెనుగుతోట
చక్కగున్నది
పూలబాట
పట్టమంటున్నది
అలరులు
అలరించుచున్నవి
అంతరంగాలను
ఆహ్లాదపరుస్తున్నవి
సుమసౌరభాలు
వీచుచున్నవి
పరిసరాలను
పరవశపరుస్తున్నవి
పలురకాలపూలు
తొంగిచూస్తున్నవి
పెక్కురంగులందు
కనువిందుచేస్తున్నవి
మొగ్గలు
మురిసిపోతున్నాయి
సిగ్గులు
ఒలకపోస్తున్నాయి
విరులు
విచ్చుకుంటున్నాయి
కళ్ళకు
విందునిస్తున్నాయి
గాలికి
ఊగుతున్నాయి
వానకి
తడుస్తున్నాయి
పక్కకు
పిలుస్తున్నాయి
ప్రేమను
చాటుతున్నాయి
అందచందాలు
ఆరబోస్తున్నాయి
ఆనందాలను
అందిస్తున్నాయి
తుమ్మెదలు
వ్రాలుచున్నవి
తేనెచుక్కలు
త్రాగుచున్నవి
తోటలో తిరుగుదాం
వస్తారా
పూలతో మాట్లాడుదాం
కలుస్తారా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment