అందచందాలు


అందాన్ని

ఆరగిస్తా

కడుపుని

నింపుకుంటా


అందాన్ని

అస్వాదిస్తా

దప్పికని

తీర్చుకుంటా


అందాన్ని

దోచుకుంటా

మదిలో

దాచుకుంటా


అందాన్ని

అనుభవిస్తా

అనుభూతులుని

అందరికిపంచిపెడతా


అందాన్ని

వెతికిపట్టుకుంటా

వదలకుండా

వెంటపెట్టుకుంటా


అందాన్ని

వెలిగిస్తా

అందరిని

చూడమంటా


అందాన్ని

పొగుడుతా

తోడుగా

నిలువమంటా


అందాన్ని

వేడుకుంటా

అంటిపెట్టుకొని

ఉండమంటా


అందాన్ని

ఆరాధిస్తా

ఆనందాన్ని

పొందుతా


అందాన్ని

ఆడమంటా

వీక్షించి

పొంగిపోతా


అందాన్ని

పాడమంటా

ఆలకించి

మురిసిపోతా


అందాన్ని

పంచుతా

స్వీకరించి

సంతసపడమంటా


అందాన్ని

అక్షరరూపంలోపెడతా

పాఠకులను

పరవశపరుస్తా


అందాన్ని

నిలువమంటా

పుటలపైకి

ఎక్కిస్తా


అందాన్ని

వర్ణిస్తా

ఆనందాన్ని

కలిగిస్తా


అందానికి

పెద్దపీటవేస్తా

ఆనందానికి

ప్రాధాన్యమిస్తా


అందమే

ఆనందమంటా

అందరిని

అందుకోమంటా


గుంద్లపల్లి రాజేంద్ర ప్రసాద్.భాగ్యనగరం



Comments

Popular posts from this blog