నా దేశం
పాలుపొంగు నేల నాది
పంటలకు నెలవు నాది
సిరులున్న సీమ నాది
వనరులకు చోటు నాది
అందమైన ప్రాంతము నాది
ఆనందాల ప్రదేశము నాది
రత్నాలరాశులుగా అమ్మినరాజ్యము నాది
ముత్యాలు మెడలనిండామెరిసినచోటు నాది
పువ్వులుపూచే తోట నాది
ఫలాలుకాచే వనము నాది
నదులుపారే నేల నాది
నరులకు స్వర్గసీమ నాది
దేవతలువెలసిన దేశము నాది
పరమభక్తులుపుట్టిన పుణ్యభూమి నాది
ప్రేమలుచాటిన ప్రదేశము నాది
భ్రమలుకొలుపు భూమి నాది
సహాయసహకారాలిచ్చు సమాజము నాది
కలసిమెలసిజీవించు క్షేత్రము నాది
పౌరుషాలకు పురిటిగడ్డ నాది
ప్రావిణ్యాలకు పుట్టినిల్లు నాది
తెలుగువారికి తెగులుతగిలించకండి
వర్గవైషమ్యాలను తట్టిలేపకండి
ఆంధ్రులచరిత్రను కాపాడండి
కక్ష్యసాధింపులకు తావివ్వకండి
పరిపాలకులను గమనించండి
అవినీతిపరుల ఆటలుకట్టించండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment