కలంపరుగులు


కలమును

కదిలిస్తా

కవితలను

కూర్చేస్తా


పేనాను

పడతా

అక్షరాలను

అల్లుతా


పేపరును

పట్టుకుంటా

పదాలను

పేరుస్తా


సొగసులను

చూపుతా

సంతసాలను

చేకూరుస్తా 


కవితలను

కూర్చుతా

నవ్యతను

చాటుతా


కయితను

కమ్మగాపాడుతా

శ్రావ్యతను

చెవులకందిస్తా


అలరులను

తీసుకొస్తా

దండలను

గుచ్చుతా


ప్రేమను

చూపుతా

మదులను

ముట్టేస్తా


ఊహలను

ఊరిస్తా

పాత్రలను

పూరిస్తా


అమృతాన్ని

అందిస్తా

దాహార్తిని

తీరుస్తా


భావాలను

వడ్డిస్తా

కడుపులను

నింపేస్తా


విషయాలను

వివరిస్తా

మనసులను

మురిపిస్తా


అక్షరాలంటే

అలరులు

పదాలంటే

పరిమళాలు


కలమంటే

వ్రాతలు

గళమంటే

పలుకులు


కాగితమంటే

మనసులు

కవితలంటే

ముద్రలు


కవిత్వమంటే

కవులశ్రమలు

సాహిత్యమంటే 

సర్వకవనసంపుటాలు


కాంచండి

కలముపరుగులు

పరికించండి

పదప్రయోగాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog