తెలుగు తియ్యందనాలు


తెలుగుతీపిని

చల్లుతా

నోర్లలో

నానుతా


తెలుగుతీపిని

వినమంటా

వీనులకు

విందునిస్తా


తెలుగుతీపిని

పెంచుతా

తోటివారికి

పంచుతా


తెలుగుతీపిని

చూపుతా

తృష్ణను

తీర్చుకోమంటా


తెలుగుతీపిని

వడ్డిస్తా

తొందరగా

తినమంటా


తెలుగుతీపిని

పారిస్తా

గటగటా 

త్రాగమంటా


తెలుగుతీపిని

పొంగిస్తా

తలలకు

ఎక్కిస్తా


తెలుగుతీపిని

వినిపిస్తా

మదులను

మురిపిస్తా


తెలుగుతీపిని

పలికిస్తా

తేనెచుక్కలు

చల్లిస్తా


తెలుగును

తీపంటా

వెలుగును

తెలుగంటా


తెలుగును

పువ్వంటా

సౌరభమును

తెలుగంటా


తెలుగును

నవ్వంటా

నగుమోములను

తెలుగంటా


తెలుగును

సుందరమంటా

సంతోషమును

తెలుగంటా


తెలుగును

లెస్సంట

వైభవమును

తెలుగంటా


తెలుగును

నుడవమంటా

నుడికారమును

తెలుగంటా


తెలుగును

క్రోలుకోమంటా

తెలుగుకు

జైకొట్టమంటా


తెలుగుకు

పట్టంకడతా

తెలుగుకవితలను

పఠింపజేస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం






Comments

Popular posts from this blog