వర్షగీతం
వర్షం
కురిసింది
హర్షం
ఇచ్చింది
ఉరుములు
వినిపించాయి
మెరుపులు
కనిపించాయి
చినుకులు
పడ్డాయి
చిటపట
అన్నాయి
జోరువాన
కురిసింది
హోరుగాలి
వీచింది
భూమి
తడిసింది
నీరు
పారింది
పిల్లలు
ఆటలాడారు
కప్పలు
బెకబెకలాడయి
కాలువలు
పారాయి
చెరువులు
నిండాయి
వాగులు
పొంగాయి
నదులు
ప్రవహించాయి
చెట్లు
ఊగాయి
నీరు
త్రాగాయి
పొలాలు
పచ్చబడ్డాయి
మనసులు
ముచ్చటపడ్డాయి
పువ్వులు
పూచాయి
కాయలు
కాచాయి
వానలు
కురిశాయి
కరువును
తీర్చాయి
వర్షాలు
పడ్డాయి
పంటలు
పండాయి
వర్షం
గీతమాలపించింది
గానం
శ్రావ్యతనిచ్చింది
ఆకసానికి
ధన్యవాదాలు
మబ్బులకు
వందనాలు
వర్షాన్ని
వీక్షించండి
వర్షగీతాన్ని
వినిసంతసించండి
కవులను
ప్రోత్సహించండి
కవితలను
ఆస్వాదించండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment