తెలుగు కాంతులు
తెలుగు
వెలుగుతుంది
తెరువును
చూపుతుంది
అక్షరాలు
అలరారుచున్నాయి
అందరిని
ఆకర్షిస్తున్నాయి
పదాలు
ప్రకాశిస్తున్నాయి
పెదవులను
పలుకమంటున్నాయి
కాగితాలు
కళుకులుచిమ్ముతున్నాయి
కమ్మదనాలను
కుమ్మరిస్తున్నాయి
కలాలు
కాంతులుచిమ్ముతున్నాయి
కైతలను
కూర్చమంటున్నాయి
కవితలు
కళకళలాడుతున్నాయి
కవనాలు
కుతూహలపరుస్తున్నాయి
కవులు
కాంతిల్లుచున్నారు
కైతలు
కట్టిపడవేస్తున్నాయి
పాఠకులు
ప్రభవిస్తున్నారు
పఠించి
పరవశపడుతున్నారు
కవిత
కిరణాలుచల్లుతుంది
కవనలోకమును
కదిలిస్తుంది
సాహితి
శోభిల్లుతుంది
చదువరులను
సంతసపరుస్తుంది
సరస్వతి
సొంపారుతుంది
చిద్విలాసమును
చిందుతుంది
వాణీదేవి
వెలిగిపోతుంది
వీణావాణిని
వినిపిస్తుంది
తెలుగు
జ్వలిస్తుంది
మదులను
మురిపిస్తుంది
తెలుగుతల్లికి
వందనాలు
తెలుగువారికి
స్వాగతాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment