కవిగారి కమామిషు
అతడు కవి
కనిపించక వినిపిస్తాడు
అతని కలము
అమృతాన్ని చిందిస్తుంది
అతని క్షరరహితాలు
దీపాల్లా వెలుగుతాయి
అతని పదాలు
ఆయస్కాంతంలా పట్టుకుంటాయి
అతని కైతలు
అంతరంగాలను దోచుకుంటాయి
అతని రాతలు
అందాలు చూపిస్తాయి
అతని కవనాలు
ఆనందము కలిగిస్తాయి
అతని పెదవులు
తేనెచుక్కలు చల్లుతాయి
అతని గళము
వీనులకు విందునిస్తుంది
అతని కల్పనలు
పాఠకులను భ్రమిస్తాయి
అతని శిల్పము
అందరిని ఆకట్టుకుంటుంది
అతని శైలి
అత్యంత సరళమైనది
అతని ఆలోచనలు
విన్నూతనమైనవి
అతని భావాలు
మదిని మీటుతాయి
అతని అల్లికలు
వైవిద్యభరితమైనవి
అతని అనుభూతులు
తెలుసుకోతగినవి
అతని వర్ణనలు
అద్భుతమైనవి
అతని పుటలు
అందరూ చదవతగినవి
అతని ప్రయోగాలు
ప్రశంసనీయమైనవి
అతని సృష్టి
అజరామరం
అట్టి కవికి
స్వాగతం వందనం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment