బాలల్లారా!
బాలల్ల్లారా
బంగరు బుడతల్లారా
బాలికల్లారా
బహుసుందర బిడ్డల్లరా
బడిపిల్లల్లారా
బుద్ధిగచదివే చిన్నారుల్లారా
బుజ్జాయిల్లారా
భావిభారత పౌరుల్లారా
చక్కని విషయాలు
చాలాచాలా చెబుతా
శ్రద్ధగా ఆలకించి
చెవులకు ఎక్కించుకుంటారా
ఆటలెంత
ముఖ్యమో
పాఠాలంత
ముఖ్యమురా
అమ్మలెంత
ప్రధానమో
అధ్యాపకులంత
ప్రధానమురా
పితరుడెంత
అవసరమో
ప్రధానోపాధ్యాయుడంత
అవసరమురా
ప్రేమయెంత
ఆవశ్యకమో
స్నేహమంత
ఆవశ్యకమురా
బొమ్మలెంత
ప్రాధాన్యమో
పుస్తకాలంత
ప్రాధాన్యమురా
ఇల్లుయెంత
శ్రేష్టమో
బడియంత
శ్రేష్టమురా
డబ్బెంత
అక్కరో
చదువంత
అక్కరురా
వెలుగెంత
అగత్యమో
విఙ్ఞానమంత
అగత్యమురా
విద్యార్ధుల్లారా
పెద్దలమాటలు వినండిరా
బంగారుభవిష్యత్తుకు
పూలబాటలు నిర్మించుకోండిరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment