ఓ చెలియా!
నీ కన్నులు
కట్టేస్తున్నాయి
నీ చూపులు
పట్టేస్తున్నాయి
నీ సిగపువ్వులు
మత్తెక్కిస్తున్నాయి
నీ చిరునవ్వులు
చెంతకుపిలుస్తున్నాయి
నీ గాజులు
గలగలమంటున్నాయి
నీ గజ్జెలు
ఘల్లుఘల్లుమంటున్నాయి
నీ పలుకులు
తేనెలుచిందుతున్నాయి
నీ నడకలు
హంసనుతలపిస్తున్నాయి
నీ అందం
అలరిస్తుంది
నాకు ఆనందం
కలిగిస్తుంది
నిను చూడక
నేనుండలేను
నిను విడిచి
నేబ్రతుకలేను
నీ సొగసును
ఎరవేశావు
నా మనసును
దోచేశావు
నన్ను
కవ్విస్తున్నావు
నన్ను
మురిపిస్తున్నావు
వయ్యారాలు
ఒలికిస్తున్నావు
ప్రేమానురాగాలు
పంచేస్తున్నావు
నాకు
నిదురరావటంలా
నాకు
ఆకలికావటంలా
వచ్చెయ్యి
ఒకటవుదాం
జీవితాన్ని
జయించుదాం
ఆలశ్యం
చెయ్యొద్దు
ప్రాణం
తీయొద్దు
ప్రణయలోకాన్ని
చేరుదాం
స్వర్గసుఖాల్ని
అనుభవిద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment